- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ మాజీ గవర్నర్ తండ్రి మృతి.. మంత్రి కొండా సురేఖ దిగ్భ్రాంతి
తెలంగాణ మాజీ గవర్నర్ తండ్రి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) విచారం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ గవర్నర్ తండ్రి మృతి పట్ల దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Minister Konda Surekha) విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్ (Tamilisai SoundaraRajan) తండ్రి హరికృష్ణన్ నాడార్ అనంత కృష్ణన్ (Harikrishna Nadar Anantha kirishnan) మృతి(Died) చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. బుదవారం తుది శ్వాస విడిచారు. కాంగ్రెస్ నేతగా పని చేసిన ఆయన మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ తమిళసై ట్వీట్ కు స్పందిస్తూ.. ఆమె తండ్రి మృతి పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొండా సురేఖ.. తెలంగాణ మాజీ గవర్నర్ డా. తమిళసై సౌందరరాజన్ తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హరికృష్ణన్ నాడార్ అనంతకృష్ణన్ మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే అనంతన్ నాలుగుసార్లు శాసనసభకు, ఒకసారి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నో సేవలు అందించారని గుర్తుచేశారు. ఇక తండ్రిని కోల్పోయి దుఃఖంలో ఉన్న మాజీ గవర్నర్ తమిళ సై కి, వారి కుటుంబ సభ్యులకు మంత్రి కొండా సురేఖ ప్రగాఢ సంతాపాన్ని (Deep Condoleces) తెలిపారు.






