- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ సర్పంచ్ క్షుద్రపూజల కలకలం.. భయాందోళనలో గ్రామ ప్రజలు.. వీడియో వైరల్
by Ramesh Naini |
టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. ఇప్పటికీ క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కొంత మంది ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: టెక్నాలజీ యుగంలోనూ ప్రజలు మూఢనమ్మకాలను వీడటం లేదు. ఇప్పటికీ క్షుద్రపూజలు చేస్తున్నారంటూ కొంత మంది ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం కొమ్ముగూడెం గ్రామంలో క్షుద్రపూజల కలకలం రేపింది. ఆ ఊరి మాజీ సర్పంచ్ అభ్యర్థి క్షుద్రపూజలు చేస్తూ అమాయక గిరిజనులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ మేరకు అన్నం రాసులపై మాంసం, రక్త తర్పణాలు చేస్తూ గాల్లోకి నిమ్మకాయను లేపిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. దీంతో గ్రామ ప్రజలు భయాందోళనలో ఉన్నారు. డబ్బు కోసం మాజీ సర్పంచ్ అభ్యర్థి మూఢనమ్మకాలు వ్యాపింపజేస్తున్నాడని, పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఇదే..
Next Story






