- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈడీ అదుపులో తలసాని మాజీ OSD కళ్యాణ్
బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) యొక్క మాజీ ఓఎస్‌డీ కళ్యాణ్ కుమార్(OSD Kalyan Kumar)ను కొద్దిసేపటి క్రితం ఈడీ(ED) అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) యొక్క మాజీ ఓఎస్‌డీ కళ్యాణ్ కుమార్(OSD Kalyan Kumar)ను కొద్దిసేపటి క్రితం ఈడీ(ED) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. గొర్రెల పంపిణీ స్కీంలో రూ. 700 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ అధికారులు కళ్యాణ్ ఇంటితో సహా హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు, భారీగా నగదును స్వాధీనం చేసుకున్నారు. కళ్యాణ్‌ను సుమారు 7 గంటల పాటు విచారించినట్లు సమాచారం.
ఈ కేసు గత ప్రభుత్వం హయాంలో అమలు చేసిన గొర్రెల పంపిణీ స్కీంలో జరిగిన ఆర్థిక అక్రమాలకు సంబంధించినది కాగా... ఈ స్కీంలో రూ. 700 కోట్ల నిధులు దుర్వినియోగం అయినట్లు ఏసీబీ ఆరోపించింది. కళ్యాణ్ కుమార్, తెలంగాణ లైవ్‌స్టాక్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సీఈఓ సబావత్ రామ్‌చందర్‌తో కలిసి, నకిలీ లబ్ధిదారుల పేరిట భారీగా నిధులను దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులు, మధ్యవర్తులు అరెస్టయ్యారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (పీఎమ్‌ఎల్‌ఏ) కింద కేసును నమోదు చేసి, ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తోంది ఈడీ.
ఈ స్కీంలో భారీగా నిధులు నకిలీ ఖాతాలకు బదిలీ అయినట్టు ఏసీబీ గుర్తించింది. ఇందులో కళ్యాణ్ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే తలసాని ప్రత్యేక అధికారి కావడంతో ఆయనకు కూడా ఏమైనా ఈ స్కామ్ లో ఏమైనా సంబంధం ఉందా అని ప్రజలు అనుమానిస్తున్నారు.






