- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్ సభకు లక్షలాదిగా జనం వస్తారు: మాజీ ఎంపీ
మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ప్రజలు ఈ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ప్రజలు ఈ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా జనం తరలివస్తారని.. కేసీఆర్ సందేశం కోసం యావత్ తెలంగాణ ఎదురుచూస్తున్నదని అన్నారు. ఎల్కతుర్తికి వెళ్లడానికి రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేదని.. రజతోత్సవ సభకు ఎల్కతుర్తిలో ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. 27న జరిగే సభ రాష్ట్రానికి దిశ దశ చూపుతుందన్నారు. గత సభలకు దీటుగా ఈ సభ జరుగుతుందని చెప్పారు. అమాయకులను మతం పేరిట చంపడం అత్యంత విషాదకరమని తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నదని ఆరోపించారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. ఈ ప్రెస్‌మీట్‌లో బీఆర్ఎస్ నేతలు పి.శశిధర్ రెడ్డి, పల్లె రవికుమార్, పట్నం మాణిక్యం, సి.కళ్యాణ్ రావు పాల్గొన్నారు.






