- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిబ్రవరి 12న జరిగే సమ్మెను కార్మికులు సక్సెస్ చేయాలి : మాజీ ఎంపీ వినోద్ కుమార్ పిలుపు
కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న కార్మిక సంఘాల పిలుపు నిచ్చిన సార్వత్రిక సమ్మెలో కార్మికులందరు పాల్గొనాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం కార్మిక విధానాలను వ్యతిరేకిస్తూ ఫిబ్రవరి 12న కార్మిక సంఘాల పిలుపు నిచ్చిన సార్వత్రిక సమ్మెలో కార్మికులందరు పాల్గొనాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. శనివార తెలంగాణ భవన్లో కార్మిక విభాగం అధ్యక్షులు రాంబాబు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి హాజరై ప్రసంగించారు. పెట్టుబడి దారి వ్యవస్థ లో అన్ని మారిపోయాయని, కార్మిక సంఘాలకు గతంలో అనేక వెసులుబాటులు ఉండేవని, నేడు యాజమాన్యాలు కార్మికుల హక్కులు కాలరాస్తున్నారు.
గిగ్ వర్కర్ల చనిపోయారు..
దోపిడి ఉన్నంత వరకు కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తాయని, కేంద్రం శ్రమను హక్కు కాకుండా ధర్మంగా పరిగణించాలని ఇటీవల చెప్పిందన్నారు. గిగ్ వర్కర్ల 10 నిమిషాల నిబంధనను ఎత్తివేశారని, ఇది అమలులో ఉన్నప్పుడు ఎంతో మంది గిగ్ వర్కర్ల చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఉండే కార్పొరేట్ శక్తుల కనుసన్నల్లో ఈ ప్రభుత్వం నడుస్తోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు, గతంలో కాంగ్రెస్ ఉన్న ఇదే పరిస్థితి ఉండేదన్నారు. లేబర్ కోడ్ లను ప్రజలకు తెలపాలని, నాలుగు చట్టాలను కార్మికులకు వివరించాలన్నారు. సార్వత్రిక సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు.






