- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ పోరాటానికి అన్ని పార్టీలు కలిసి రావాలి.. వీహెచ్ కీలక పిలుపు
మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉప కులాలకు న్యాయం జరగకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (VH) హెచ్చరించారు.

దిశ, వెబ్‌డెస్క్: మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉప కులాలకు న్యాయం జరగకుంటే దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (VH) హెచ్చరించారు. గురువారం గాంధీ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రేపు జరగబోయే మహిళా రిజర్వేషన్ బిల్లు చర్చకు అందరూ మద్దతు ఇవ్వాలని కోరుతూనే, అందులో బీసీ మహిళల వాటాపై వీహెచ్ కీలక ప్రశ్నలు సంధించారు. "మహిళా బిల్లును మేము స్వాగతిస్తున్నాం, కానీ అందులో మా బీసీ మహిళల వాటా ఏది? సంఖ్య పరంగా బీసీలకు న్యాయం జరగాలి" అని ఆయన డిమాండ్ చేశారు. కుల గణనలో తమకు కేటగిరీ రిజర్వేషన్లు కల్పించాలని, రెండోసారి చేస్తామన్న హామీలపై తమకు నమ్మకం లేదని స్పష్టం చేశారు.
ఈ నెల 16న 'చలో ఢిల్లీ'..
మహిళా రిజర్వేషన్లలో బీసీలకు చోటు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న 'చలో ఢిల్లీ' కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వీహెచ్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా ప్రతి మహిళా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. "రాజ్యాధికారంలో మా మహిళలకు చోటు కల్పించకుంటే, 'నరేంద్ర మోడీ హఠావో - OBC బచావో' నినాదంతో ముందుకు వెళ్తాం. నిజమైన పేదలకు లబ్ధి చేకూరడమే మా లక్ష్యం." అని వీ. హనుమంతరావు పేర్కొ్న్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ఉద్దేశించి మాట్లాడుతూ.. "OC సామాజిక వర్గానికి చెందిన రాహుల్ గాంధీలో మార్పు వచ్చింది, ఆయన బీసీల హక్కుల గురించి మాట్లాడుతున్నారు. కానీ బీసీ అని చెప్పుకునే మోడీ మాత్రం మా గురించి ఆలోచించడం లేదు" అని విమర్శించారు. మోడీ ఇప్పటికైనా బీసీల స్థితిగతులపై పునరాలోచించి నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు. ఈ పోరాటానికి అన్ని రాజకీయ పార్టీల మిత్రులు మద్దతు తెలపాలని, బీసీలకు రాజ్యాధికారంలో వాటా దక్కే వరకు విశ్రమించబోమని ఆయన పునరుద్ఘాటించారు.






