- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి షాక్.. ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు
కాంగ్రెస్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డిక బిగ్ షాక్ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ నేత, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఈ మేరకు ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు. అయితే, నగరంలోని డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ (DSR Construction Company)లో ఇవాళ తెల్లవారుజాము నుంచి ఆదాయ పన్ను శాఖ అధికారులు సోదాలు చేపడుతోన్న విషయం తెలిసిందే. పన్ను చెల్లింపుల్లో అవకతవకలు కారణంగా సీఆర్‌పీఎఫ్ (CRPF) బలగాల బందోబస్తు మధ్య రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు 30 బృందాలుగా విడిపోయి డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్స్ సీఈవో సత్యనారాయణ రెడ్డి ఇంటితో పాటు ఆ సంస్థ ఎండీ సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.
ఇక జూబ్లీహిల్స్, బంజార్ హిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంతో పాటు నెల్లూరు, బెంగళూరులోని డీఎస్ఆర్ కన్స్‌స్ట్రక్షన్‌కు చెందిన ప్రధాన కార్యాలయాలు అనుబంధ సంస్థలు, రాజకీయ నేతల్లో ఏక కాలంలో మొత్తం 30 చోట్ల మూడు రాష్ట్రాల్లో రెయిడ్స్ కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా డీఎస్ఆర్ గ్రూపుతో చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి భారీ ఎత్తున వ్యాపార లావాదేవీలు జరిపినట్లుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఆయన ఇంటితో పాటు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. డీఎస్ఆర్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ పన్ను చెల్లింపులపైనే అధికారులు ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.






