బండి సంజయ్ అరెస్ట్ నాటకం: పొన్నం ప్రభాకర్

by GSrikanth |
బండి సంజయ్ అరెస్ట్ నాటకం: పొన్నం ప్రభాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: బండి సంజయ్ అరెస్ట్ నాటకమని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్​ఫైర్​అయ్యారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్​పార్టీని ప్రజల నుంచి దూరం చేసేందుకు రెండు పార్టీ కుమ్మక్కయ్యాయని తెలిపారు. ప్రజా సమస్యలు గాలికి వదిలేసి రెండు పార్టీలు మోసం చేస్తున్నాయన్నారు. ప్రజలంతా గమనిస్తున్నారని, తప్పకుండా రాబోయే రోజుల్లో బుద్ది చెబుతారని స్పష్టం చేశారు. సీపీ స్పష్టంగా పేర్కొన్నప్పటికీ బండి సంజయ్‌కు బెయిల్ ఎలా? వచ్చిందని ప్రశ్నించారు. రెండు పార్టీలు కలసి ఆడుతున్న డ్రామాగా వర్ణించారు. కరీంనగర్‌లో బండి గెలవడం ఇక కలేనని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచినప్పటి నుంచి ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా తీసుకురాలేదన్నారు.

Next Story

Most Viewed