లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవిత జై తెలంగాణ అనడం సిగ్గు చేటు: మధుయాష్కీ గౌడ్ ఫైర్

by Satheesh |

అవినీతికి పాల్పడ్డోళ్లు ‘జై తెలంగాణ’ అనడానికి అనర్హులు అంటూ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో

లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవిత జై తెలంగాణ అనడం సిగ్గు చేటు: మధుయాష్కీ గౌడ్ ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: అవినీతికి పాల్పడ్డోళ్లు ‘జై తెలంగాణ’ అనడానికి అనర్హులు అంటూ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. లిక్కర్ స్కామ్‌లో ఇరుక్కున్న కవిత కూడా జై తెలంగాణ అనడం సిగ్గు చేటన్నారు. ఆదివారం గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పదేళ్లలో బీఆర్ఎస్ దుర్మార్గపు పాలనను అమలు చేసిందన్నారు. మలి దశ తొలి అమరవీరుడు శ్రీకాంత చారి తల్లికి కూడా కనీసం గుర్తింపు ఇవ్వలేదన్నారు. కేసీఆర్ అండ్ టీమ్ రాష్ట్రాన్ని రాబందుల్లా పీక్కుతిన్నారన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా గాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే, కేసీఆర్ మోసపూరిత మాటలతో ప్రజలను మోసం చేశాడన్నారు.

గడిచిన పదేళ్లలో అవకాశం ఉన్న ప్రతీ చోట అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం శాంతియుతంగా జరుగుతుండగా కేసీఆర్, హరీష్ రావులు ప్రజలను రెచ్చగొట్టడంతోనే ఆత్మ బలిదానాలు జరిగాయన్నారు. క్విట్ ఇండియా ఉద్యమం తరహాలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ నేతృత్వంలో కొనసాగిందన్నారు. సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో కేసీఆర్ పత్తా లేడన్నారు. రాజ్యసభలోనూ కేసీఆర్ పార్టీకి ఒక్క సీటు లేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఎంపీల కృషితోనే తెలంగాణ వచ్చిందన్నారు.

10 ఏళ్ల పాటు ప్రజలు అధికారం ఇచ్చినా కేసీఆర్ దుర్మార్గ పాలనలో ఆత్మ బలిదానాలు ఆగలేదన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలను రెచ్చగొట్టి కేసీఆర్ బలిదానాలకు కారణమయ్యాడన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వకుండా యువత బలిదానాల కారణమయ్యాడని ఆరోపించారు. అమరవీరుల కుటుంబాలను, ఉద్యమకారులను పట్టించుకోలేదన్నారు. కానీ తెలంగాణ అమరవీరుల ఆశయాలు, ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు.

అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ముందుకు వెళ్తున్నామన్నారు. ఇక దేశవ్యాప్తంగా విడుదలైన ఎగ్జిట్ పోల్ ఫలితాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. 2004లో కూడా ఇదే మాదిరిగా ఎన్డీఏ కూటమికే ఎక్కువ సీట్లు అని చెప్పి బోల్తా పట్టించారన్నారు. మోడీ ప్రభుత్వానికి తలోగ్గిన కొన్ని సంస్థలు, మీడియా చానళ్లు తప్పుడు సర్వేలను ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్‌ని తాను పూర్తిగా నిరాకరించడం, ఆమోదించడం లేదన్నారు.

Next Story