- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ఈసారి బీజేపీకి ఛాన్స్.. ప్రజాదరణ పెరుగుతోంది: మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
రోజు రోజుకు ప్రధాని మోడీ, బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని బీజేపీ మాజీ ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మంత్రులు (GST) జీఎస్టీ పై అవగాహనా రాహిత్యంతో విమర్శలు చేస్తున్నారని, జీఎస్టీ తగ్గడంతో ప్రధాని మోడీని దేశ ప్రజలు ఒక దైవంగా చూస్తున్నారని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (Former MP Boora Narsaiah Goud) పేర్కొన్నారు. కాంగ్రెస్‌నేతలు కడుపు మంటతో శాపనార్థాలు పెడుతున్నారని తెలంగాణకు రూ. 7 వేల కోట్ల నష్టం అని తెలిసిన ఇలాంటి ప్రకటన చేయడం ఎంతో గొప్ప విషయమన్నారు. శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ మాజీ మంత్రి కేటీఆర్దేశ ప్రధాని మోడీ రూ.15 లక్షలు దోచుకున్నారని చేసిన ప్రకటనను తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. (Narendra Modi) మోడీ నీతివంతమైన రాజకీయాలకు బ్రాండ్ అంబాసిడర్ అయితే, బీఆర్ఎస్, కాంగ్రెస్‌పార్టీలు రాజకీయ అవినీతి పాలిటిక్స్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. కేంద్రం గత 11 సంవత్సరాల్లో రూ. 315 లక్షల కోట్ల బడ్జెట్ ప్రవేశ పెట్టిందని ఒక్క రూపాయి అవినీతి మారక లేదని, బీఆర్ఎస్పార్టీ అవినీతి జగమెరిగిన నిజం అన్నారు.
గతంలో జీఎస్టీని గబ్బర్ సింగ్ టాక్స్ అని ఎద్దేవా చేసిన రాహుల్ గాంధీ నోటికి తాళం పడిందన్నారు. నూతన సంస్కరణలతో దేశంలో 30 కోట్ల కుటుంబాలకు రూ. 5-6 లక్షల కోట్ల లాభం చేకూరుతుందని తెలిపారు. రోజు రోజుకు ప్రధాని మోడీ, (BJP) బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ కు 50 ఏళ్లు, బీఆర్ఎస్కు పదేళ్లు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ఈ సారి బీజేపీకి ఒక ఛాన్స్ ఇవ్వాలనే తపన తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు. ఈ రెండు కుటుంబాల పార్టీలు భయంతో అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.






