- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘట్కేసర్ దాడికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి.. మాజీ ఎంపీ నర్సయ్య గౌడ్ డిమాండ్
గోవులను అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన గోరక్షకుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై కాల్పులు జరపడం దారుణమని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఖండించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గోవులను అక్రమంగా తరలిస్తుండగా అడ్డుకోవడానికి ప్రయత్నించిన గోరక్షకుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై కాల్పులు జరపడం దారుణమని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (Boora Narsaiah Goud) ఖండించారు. గురువారం ఒక ప్రకటనలో పేర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, గోవులను అక్రమంగా తరలించే వారిని కాపాడుతూ, గోరక్షకులపై దాడులు, హింసలు, కాల్పులు పెరుగుతున్నాయని ఆరోపించారు. ఇటీవల వాహనాలతో తొక్కే ప్రయత్నాలు, శారీరక దాడులు, తాజాగా కాల్పులు ఘటనతో రాష్ట్రంలో చట్ట వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఘట్కేసర్ ఘటనకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు. కాల్పులకు పాల్పడిన ఇబ్రహీంను వెంటనే అరెస్టు చేసి, చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.
కోట్లాది ప్రజల మనోభావాలను కాపాడాలంటే ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఈ ఘటనలో నిందితుడిని అరెస్టు చేసి చట్టప్రకారం కఠిన శిక్ష విధించాలి. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆగ్రహం ఉధృతం అవుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. గోరక్షకుడు సోను సింగ్‌కు తుపాకీ గుండుతో ఊపిరితిత్తులు, లివర్, కండరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆపరేషన్ చేసిన యశోద సర్జికల్ బృందం బుల్లెట్‌ను విజయవంతంగా తొలగించిందని వివరించారు. తాను ఒక డాక్టర్ గా నా సహచర వైద్యులతో మాట్లాడి చూసిన తర్వాత పేషెంట్ పరిస్థితి ఇంకా క్రిటికల్‌గా ఉంది. మరుసటి 72 గంటలు అత్యంత కీలకం. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ధర్మాన్ని కాపాడే గోరక్షకుల పై దాడులు జరగడం అత్యంత దురదృష్టకరమని ఆవేదన చెందారు.






