- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రూపాయి ఖర్చు లేకుండా పాకిస్థాన్‌ను మోడీ చావుదెబ్బ కొట్టారు: బూర
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను గాలికొదిలేసి, అందాల పోటీలపై ఆసక్తి చూపుతోందని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో విఫలమైందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను గాలికొదిలేసి, అందాల పోటీలపై ఆసక్తి చూపుతోందని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడంలో విఫలమైందని బీజేపీ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్విమర్శించారు. గురువారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. చాలా దేశాల్లో, రాష్ట్రాల్లో అందాల పోటీలు జరుగుతుంటాయి, అక్కడున్న ముఖ్యమంత్రులు ఆ పోటీల్లో పాల్గొనరని కేవలం టూరిజం పరంగా మద్దతు తెలుపుతారని గుర్తుచేశారు. కానీ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నదాతలను వదిలేసి, అందాల భామల పోటీలను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో రైతులను గాలి, ఎండ, వర్షాలకు నష్టపోయారని ప్రభుత్వం వారికి పరిహారం ఇవ్వాలనే ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు.
ఇప్పటికైనా రైతులు కష్టపడి పండించిన పంటలను వెంటనే కొనాలని, చాలాచోట్ల నెలల కొద్దీ, వారాల కొద్దీ ధాన్యం కుప్పలు, వర్షాలు, ఐకేపీ సెంటర్లలో రైతుల తిప్పలు, మరణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతుల పంటను కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని సూచించారు. యుద్ధం చేయకుండానే యుద్ధం గెలవడం అన్నది కౌటిల్యుడు అర్థశాస్త్రంలో చెప్పిన ఒక మహత్తర సిద్ధాంతమని, భారతదేశం ఒక నెల పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తే అయ్యే ఖర్చు రూ.8 వేల కోట్లు అవుతుందన్నారు. కానీ ప్రధాని మోడీ చాణక్యనీతితో యుద్ధం చేయకుండా ఖర్చు లేకుండా పాకిస్థాన్‌ను చావుదెబ్బ కొట్టారని పేర్కొన్నారు. భారత సైన్యం ద్వారా పాకిస్థాన్, చైనాకు తగిన గుణపాఠం చెప్పడం జరిగిందన్నారు. మోడీ పాకిస్థాన్ దొంగదెబ్బకు దెబ్బకొట్టి చాణక్య నీతితో భారత్‌ను గెలిపించారని గుర్తుచేశారు. మన జవాన్లకు మద్దతుగా, వారి త్యాగాలను గౌరవించుకునేలా త్రివిధ దళాలకు సెల్యూట్ చేస్తూ ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు ట్యాంక్ బండ్ వద్ద మనం సైతం దేశం కోసం తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.






