BRS: సీఎం రేవంత్‌పై వాళ్లు ఈగ వాలనీయడం లేదు

by Gantepaka Srikanth |

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దమ్మ, చిన్నమ్మ కొడుకుల్లా ఉంటారని, మోడీతో బీజేపీ సీఎంకు దొరకని అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డి

BRS: సీఎం రేవంత్‌పై వాళ్లు ఈగ వాలనీయడం లేదు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దమ్మ, చిన్నమ్మ కొడుకుల్లా ఉంటారని, మోడీతో బీజేపీ సీఎంకు దొరకని అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి ఏవిధంగా దొరుకుతుందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్​సందేహం వ్యక్తం చేశారు. ఆ పార్టీ ఎంపీలతో రేవంత్ రెడ్డి దగ్గరగా ఉంటారని, బీజేపీ ఎంపీకి రేవంత్ రెడ్డి కాంట్రాక్టు ఇచ్చారని ఆరోపించారు. శనివారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో ఉన్నప్పుడు బీజేపీ ఎంపీతో రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని తెలంగాణ బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి కోసం పని చేస్తున్నారని పేర్కొన్నారు. బండి సంజయ్ తెలంగాణలో రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నారని, తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి కంటే ఎక్కువగా రేవంత్ రెడ్డిని బీజేపీ ఎంపీలు కాపాడుతున్నారని, ఆయనపై ఈగ వాలనివ్వరన్నారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ఓటమి ఒప్పుకున్నారని, గల్లీ, గల్లీ తిరుగుతూ ఓటర్లను, బిఆర్ఎస్ వాళ్ళను భయపెట్టే విధంగా మాట్లాడుతున్నారంటే ఓటమి భయం పట్టుకుందన్నారు. ఎన్నడూ లేని విధంగా సీఎం తొమ్మిది రోజులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఆయన భాష చూస్తుంటే కాంగ్రెస్ పార్టీ ఓటమి ఖాయంగా కనిపిస్తోందన్నారు. బరితెగించి ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు,మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడులు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్,బీజేపీ ఒక్కటి అయ్యాయని బండి సంజయ్ వచ్చి రెచ్చగొట్టే విధంగా మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి సహకారం అందిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కుక్కర్లు పంచడం,గూగుల్ పే,ఫోన్ పే చేస్తామని ఓటర్లకు చెప్తున్నారు. ఎన్నికల కమీషన్, అధికారులు కాంగ్రెస్​ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

Next Story