Jubilee Hills by-election: ‘కావాలి అంజన్న.. రావాలి అంజన్న’ జూబ్లీహిల్స్‌లో వెలసిన పోస్టర్లు కలకలం!

by Ramesh Naini |

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం రేపుతోంది.

Jubilee Hills by-election: ‘కావాలి అంజన్న.. రావాలి అంజన్న’ జూబ్లీహిల్స్‌లో వెలసిన పోస్టర్లు కలకలం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Jubilee Hills by-election) జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం రేపుతోంది. ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించకముందే.. నియోజకవర్గంలో మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ (Anjan Kumar Yadav) పోస్టర్లు (Posters) వెలిశాయి. మంగళవారం ‘కావాలి అంజన్న.. రావాలి అంజన్న.. ఇది నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష’ అంటూ జూబ్లీహిల్స్‌లో అంజన్‌కుమార్ బ్యానర్లు అంచించారు. మరోవైపు.. తాను టికెట్ ఆశిస్తున్నట్టు ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ ప్రకటించారు. అలాగే మంత్రి పదవి కూడా కావాలని బహిరంగ స్టేట్‌మెంట్ ఇచ్చారు.

ఉపఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరును పార్టీ దాదాపు ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్‌లో తాజాగా వెలసిన పోస్టర్లు అంతర్గతంగా మంట పెడుతున్నట్లు తెలుస్తోంది. కాగా, జూబ్లిహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ (Maganti Gopinath) మరణంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఉపఎన్నికలో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిగా గోపినాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఆమె కుటుంబంతో సహా ప్రచారం సైతం నిర్వహిస్తున్నారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. ఆశావాహులు ఎక్కువగానే ఉన్నారు. కానీ తాజాగా వెలిసిన పోస్టర్ల నేపథ్యంలో అంజన్‌కుమార్‌కు జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారా? అని శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

Next Story