- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జానారెడ్డి, కోమటిరెడ్డిని తొక్కుకుంటూ వచ్చావా?: సీఎం రేవంత్‌పై మాజీ ఎమ్మెల్సీ ఫైర్
రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి తాము కోరుకుంటున్నామని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నామని.. తాము ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బూతు పురాణం మొదలు పెట్టారని శాసనమండలి మాజీ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అభివృద్ధి జరగాలి తాము కోరుకుంటున్నామని.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నామని.. తాము ప్రశ్నిస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం బూతు పురాణం మొదలు పెట్టారని శాసనమండలి మాజీ విప్ కర్నె ప్రభాకర్ ఆరోపించారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చి 700 రోజులైనా సీఎంలో మార్పు రాలేదన్నారు. తమను తిడుతూ రాక్షసానందం పొందుతున్నారని.. ఓ తీవ్రవాదిగా మారారని అన్నారు. తన గురువు రాసిచ్చిన స్ర్కిప్ట్ చదువుతున్నారని.. రాష్ట్రం రావణ కాష్టం కావాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలు జానారెడ్డి, జీవన్‌రెడ్డి, హన్మంతరావులాంటి వారు స్పందించాలన్నారు. రేవంత్ మానసిన రోగిలా మారారని.. జనాన్ని కరిచేలా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆయనను డాక్టర్‌కు చూపించాలన్నారు. హార్వర్డ్ పోయి వచ్చాక మారుతారని భావించామని.. కాంగ్రెస్‌ను ఆయనే బొందపెట్టేలా ఉన్నారని ఆరోపించారు. మిర్యాలగూడ సభలో జానారెడ్డిని ఫ్యూడల్ నాయకుడని రేవంత్ అన్నారని.. తాను అందరినీ తొక్కుకుంటూ వచ్చానని స్వయంగా చెప్పారని.. అంటే జానారెడ్డి, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డిని తొక్కుకుంటూ వచ్చావా..? అని ప్రశ్నించారు. ఇప్పుడు రేవంత్ చేష్టలతో కాంగ్రెస్ 50 ఏండ్లు వెనక్కిపోయిందన్నారు. సీఎం అధికారిక సభలు పెట్టి కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని.. రాష్ట్ర ఎన్నికల సంఘం సభలపై తేల్చాలని డిమాండ్ చేశారు.






