- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Congress: తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా
తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన దిలీప్ కుమార్ ను రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ తెలంగాణ ఇంచార్జ్‌గా ఆ పార్టీ అధ్యక్షుడు జయంత్ చౌదరి నియమించారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన దిలీప్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్సీగా పని చేశారు. ఆ తర్వాత కేసీఆర్ తో విభేదాల కారణంగా ఆ పార్టీని వీడారు. అనంతరం పలు రాజకీయ పార్టీల్లో చేరారు. టీజేఎస్, బీజేపీతో పాటు 2014లో రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరి ఆ పార్టీ అధ్యక్షుడిగా పని చేశారు. ఆ తర్వాత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చినా గత కొంత కాలంగా పార్టీలో ఆయనకు పొసగడం లేదనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని దిలీప్ కుమార్ ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తాను గతంలో పని చేసిన ఆర్ఎల్డీ పార్టీలోనే చేరారు.
READ MORE ...
BRS VS Congress: కేటీఆర్ ఆరోపణలు ఐసీఐసీఐ స్ట్రాంగ్ రిప్లయ్.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ‘సోషల్’ వార్






