- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ramchander Rao: బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఆ రోజే బాధ్యతలు చేపట్టనున్న రామచందర్‌రావు!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు బాధ్యతలు స్వీకరించనున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా (BJP State Chief) మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు (Former MLC Ramchander Rao) ఎల్లుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. శనివారం అసెంబ్లీ ముందున్న గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి.. ఉదయం పది గంటలకు బీజేపీ స్టేట్ చీఫ్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. అనంతరం చార్మినార్ వద్ద ఉన్న (Bhagyalakshmi Temple) భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా, ఇటీవల తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఏకగ్రీవంగా ఎన్నిక అయిన విషయం తెలిసిందే.
కొన్ని అనూహ్య పరిణామాల మధ్య హైకమాండ్ ఆదేశాల మేరకు రామచందర్‌రావును అధ్యక్షుడిగా ఏకగ్రీవం చేశారు. అయితే, ఎమ్మెల్యే రాజా సింగ్ నామినేషన్ వేయడానికి ప్రయత్నించినప్పటికీ కౌన్సిల్ సభ్యుల బలం లేకపోవడంతో ఆయన నామినేషన్ స్వీకరించలేదు. దీంతో అసంతృప్తితో ఉన్న ఆయన రాజీనామా చేసి పార్టీకి గుడ్ బై చెప్పారు. అలాగే అధ్యక్ష రేసులో ఉన్న ఎంపీ ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్‌లు హైకమాండ్ ఆదేశాల మేరకు రామచందర్‌రావు మద్దతు ప్రకటించారు. దీంతో రామందర్‌రావు.. కిషన్ రెడ్డి స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.






