కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని ప్రచారం.. సొంత నేతలపై రెచ్చిపోయిన కొండా మురళి

by Gantepaka Srikanth |

కొండా సురేఖ(Konda Surekha) మంత్రి పదవి పోతుందని జరుగుతున్న ప్రచారంపై ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి(Konda Murali) స్పందించారు.

కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని ప్రచారం.. సొంత నేతలపై రెచ్చిపోయిన కొండా మురళి
X

దిశ, వెబ్‌డెస్క్: కొండా సురేఖ(Konda Surekha) మంత్రి పదవి పోతుందని జరుగుతున్న ప్రచారంపై ఆమె భర్త, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి(Konda Murali) స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి, రేవూరి ప్రకాశ్ రెడ్డిపై పరోక్ష విమర్శలు చేశారు. ‘నాడు టీడీపీ ఓ నాయకుడు భ్రష్టు పట్టించాడు. మొన్నటికి మొన్ననే కేసీఆర్‌(KCR)ను కూడా వెన్నుపోటు పొడిచాడు. ఇప్పుడేమో నీతులు చెబుతున్నాడు’ అని సీరియస్ కామెంట్స్ చేశారు. పార్టీ మారిన నేతలకు ఇజ్జత్ ఉంటే.. రాజీనామా చేసి మళ్లీ గెలవాలని సవాల్ చేశారు. పరకాలలో పోటీ చేసిన వ్యక్తి నా కాళ్లు పట్టుకున్నాడని హాట్ కామెంట్స్ చేశారు. ఇక నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వబోమని.. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి తమ కూతురు సుష్మిత రంగంలోకి దిగుతుందని ప్రకటించారు. కొంతమంది కావాలని సురేఖ మంత్రి పదవి పోతుందని ప్రచారం చేస్తున్నారు. ఆమె మంత్రి పదవి ఎక్కడికీ పోదు అని స్పష్టం చేశారు. పోలీస్ శాఖలో కోవర్టులు ఉన్నారని అన్నారు.. తనకు ఎస్కార్ట్ ఇచ్చిన వారిపై చర్యలు తీసుకోవడం కరెక్ట్ కాదని.. కోవర్టు పోలీసులపై వరంగల్ పోలీస్ కమిషనర్ దృష్టి పెట్టి.. చర్యలు తీసుకోవాలని సూచించారు.

Next Story