మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత

by Ajay Maddhiboyina |   (  Updated:2026-02-20 05:07:41  IST  )

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వాంతులు, విరేచ‌నాల కార‌ణంగా అస్వ‌స్థ‌కు గుర‌వ్వ‌గా చికిత్స నిమిత్తం ఆయ‌న‌ను హైద‌రాబాద్ లోని కిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

MLC Jeevan Reddy Criticizes Komatireddy Rajagopal Reddy
X

దిశ‌, వెబ్ డెస్క్: కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి జీవ‌న్ రెడ్డి అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వాంతులు, విరేచ‌నాల కార‌ణంగా అస్వ‌స్థ‌కు గుర‌వ్వ‌గా చికిత్స నిమిత్తం ఆయ‌న‌ను హైద‌రాబాద్ లోని కిమ్స్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఇదిలా ఉంటే జీవ‌న్ రెడ్డి గ‌త కొంత‌కాలంగా పార్టీలోని ప‌రిస్థితుల‌పై అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన‌ప్ప‌టి నుండి జీవ‌న్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. బ‌హిరంగంగానే సంజ‌య్ చేరిక‌ను జీవ‌న్ రెడ్డి వ్య‌తిరేకిస్తున్నారు. ఈ క్ర‌మంలో అనేక‌సార్లు భావోద్వేగానికి సైతం లోన‌య్యారు. ప‌లుమార్లు పార్టీ పెద్ద‌లు జీవ‌న్ రెడ్డితో చ‌ర్చ‌లు జ‌రిపిన‌ప్ప‌టికీ అసంతృప్తి గ‌ళం విప్పుతూనే ఉన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన మున్సిప‌ల్ ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ జీవ‌న్ రెడ్డి త‌న అభ్య‌ర్థుల‌ను స‌ప‌రేట్ గా నిల‌బెట్టుకుని గెలుపించుకున్నారు. ఇక తాజాగా అస్వ‌స్థ‌కు గుర‌వ్వ‌డంతో ఆయన ప్ర‌స్తుత ఆరోగ్య ప‌రిస్థితిపై అప్డేట్ రావాల్సి ఉంది.

Next Story