- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ జాగృతిలో చేరిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు.. కండువా కప్పి ఆహ్వానించిన కల్వకుంట్ల కవిత
రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు ఇవాళ కల్వకుంట్ల కవిత సమక్షంలో తెలంగాణ జాగృతిలో చేరారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ జాగృతి సంస్థలోకి చేరికలు మొదలయ్యాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, దివంగత మాజీ ఎమ్మెల్యే కావేటి సమయ్య (Kaveti Sammaiah) కుమారుడు కావేటి మనోహర్ కుమార్ (Kaveti Manohar) దంపతులు తమ అనుచరులతో కలిసి అధికారికంగా ఇవాళ తెలంగాణ జాగృతిలో చేరారు. హైదరాబాద్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి సంస్థలోకి సాదరంగా ఆహ్వానించారు. మనోహర్ కుమార్‌తో పాటు ఆయన సతీమణి కావేటి సబిత, వారి ప్రధాన అనుచరులు కూడా జాగృతి తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. కావేటి సమయ్య కుటుంబం తెలంగాణ పట్ల ఎంతో నిబద్ధత కలిగిన కుటుంబమని అన్నారు. మనోహర్ కుమార్ రాకతో తెలంగాణ జాగృతికి మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. జాగృతి సంస్థ చేపట్టే సాంస్కృతిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో వారు క్రియాశీలక పాత్ర పోషిస్తారని ఆశిస్తున్నానని కవిత అన్నారు.
కాగా, దివంగత నేత కావేటి సమయ్య బెల్లంపల్లి నియోజకవర్గంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన వారసుడిగా మనోహర్ కుమార్ ఇప్పుడు కవిత గారి నాయకత్వంలో పనిచేయాలని నిర్ణయించుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.






