- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రోషం ఉన్నవాళ్లు మాట్లాడటం లేదేంటి?.. మాజీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ధాన్యం టెండర్ల కుంభకోణం డబ్బు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి కక్కాల్సిందేనని.. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియరీ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ధాన్యం టెండర్ల కుంభకోణం డబ్బు మొత్తం సీఎం రేవంత్ రెడ్డి కక్కాల్సిందేనని.. మొత్తం వ్యవహారంపై జ్యుడీషియరీ విచారణ జరపాలని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం టెండర్లలో కుంభకోణం జరుగుతున్నదని బీఆర్ఎస్ చెప్పిందని.. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి కలిసి వేల కోట్ల రూపాయలు దండుకున్నారని కేబినెట్ తేల్చిందని ఆరోపించారు. డబ్బులను జప్తు చేయాలని జీఓ నంబర్ 15 విడుదల చేసిందని.. ధాన్యం టెండర్ల కుంభకోణంపై డిపార్ట్మెంట్ ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. రూ.66 కోట్లను జప్తు చేయాలని కేబినెట్ ఎందుకు తీర్మానం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కుంభకోణంపై మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. రూ.380 కోట్ల అక్రమాలకు రూ.66 కోట్లు మాత్రమే జప్తు చేశారని.. తప్పించుకోవడం కోసమే ఈ జప్తు చేశారని అన్నారు. అంతేకాకుండా.. టెండర్లు నలుగురు వేస్తే ఇద్దరికి మాత్రమే ఎందుకు పెనాల్టీ వేశారని నిలదీశారు. ఢిల్లీ పెద్దల ఒత్తిడి మేరకు కేబినెట్‌కు ఫైల్ వెళ్లిందని.. టెండర్ విలువ కంటే రూ.230 ఎక్కువ వసూలు చేశారని ఆరోపించారు. ఈ కుంభకోణంపై పార్టీలో రోషం ఉన్నవాళ్లు ఎక్కడా మాట్లాడటం లేదని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు సతీష్‌రెడ్డి, పల్లె రవికుమార్ పాల్గొన్నారు.






