- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : ఓట్ల కోసమే రైతు భరోసా డ్రామా : మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్
నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Former MLA Peddi Sudarshan Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : నర్సంపేట బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి(Former MLA Peddi Sudarshan Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ రైతు భరోసా(Riathu Bharosa) పేరిట నాటకం ఆడుతోందని, ఇన్నాళ్లూ ఈ పథకాన్ని అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని ఆయన విమర్శించారు. గతంలో కేసీఆర్(KCR) నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు(Raithu Bandhu) పథకం ద్వారా నాట్లకు నాట్లకు మధ్య రైతులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నదని గుర్తు చేసారు.
కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఓట్ల కోసం మాత్రమే రైతు భరోసా నిధులను ఇస్తూ, రైతుల గోసను పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. 18 నెలల కాంగ్రెస్ పాలనలో 600 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, నాలుగు దఫాల రైతు భరోసా నిధులను ఇవ్వకుండా ఎగనామం పెట్టారని సుదర్శన్ రెడ్డి విమర్శించారు.






