- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామం.. MP మల్లు రవిపై మీనాక్షి నాటరాజన్‌కు ఫిర్యాదు
తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంటున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress)లో మరో అనూహ్య పరిణామం చోటుచేసుకుంటున్నాయి. క్షమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి(Mallu Ravi)పై ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan)కు మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్(Sampath Kumar) కంప్లైంట్ చేశారు. పార్టీ లైన్ క్రాస్ చేసి బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే విజేయుడితో కలిసి తిరుగుడున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి చర్యలతో పార్టీకి చాలా నష్టం జరిగే అవకాశం ఉందని.. వెంటనే అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మల్లు రవిని మందలిండంతో పాటు, గాడిన పెట్టాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ నేతలతో చాలా ప్రమాదం అని.. అది గ్రహించి కాంగ్రెస్ నేతలు నడుచుకోవాలని అన్నారు. పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలోకి ఉండి రాష్ట్రాన్ని నిలువునా దోచుకున్న విషయాన్ని గుర్తుచేశారు. రైతుబంధుతో రైతులను, దళితబంధులో దళితులను, ఇంటికో ఉద్యోగం ఇస్తామని యువతను ఇలా అందరినీ బీఆర్ఎస్ మోసం చేసిందని.. అలాంటి పార్టీ నేతలతో స్నేహం మంచిది కాదని.. కాంగ్రెస్ కేడర్‌కు కూడా తప్పుడు సంకేతాలు వెళ్తాయని అన్నారు. బీఆర్ఎస్‌తో దోస్తీ చేసే నేతలు ఇకనైనా తీరు మార్చుకోవాలని కోరారు.






