- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు సీబీఐ విచారణకు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రేపు సీబీఐ విచారణకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాజరుకానున్నారు. వామనవారు దంపతుల హత్య కేసులో సీబీఐ పుట్ట మధును విచారించనుంది. రెండు నెలలుగా ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా ఇప్పటికే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు

దిశ, వెబ్ డెస్క్: రేపు సీబీఐ విచారణకు మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు హాజరుకానున్నారు. వామనవారు దంపతుల హత్య కేసులో సీబీఐ పుట్ట మధును విచారించనుంది. రెండు నెలలుగా ఈ కేసులో విచారణ కొనసాగుతుండగా ఇప్పటికే పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో పాటు ప్రధాన నిందితులను సీబీఐ విచారించింది. హత్యలో పుట్ట మధు ప్రమేయం ఉందని వామనవారు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
చనిపోయే ముందు వామనరావు దంపతులు సైతం బిట్టు శ్రీను చెప్పారు. ఇదిలా ఉంటే 2021లో పెద్దపల్లి సమీపంలోని కల్వచర్ల వద్ద కారులో వెళుతున్న వామనవారు దంపతులను రోడ్డుపై అడ్డగించి దారుణంగా హత్య చేశారు. అనంతరం అక్కడ నుండి పారిపోగా పోలీసులు వెతికిపట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసిన తరవాత మొదట కేసును స్థానికపోలీసులు విచారించారు. కానీ వామనరావు కుటుంబ సభ్యులు సీబీఐ విచారణకు డిమాండ్ చేశారు. దీంతో కేసును ప్రస్తుతం సీబీఐ విచారిస్తోంది.






