- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Rasamayi Balakishan: హరీష్ రావు ఉద్యమ బుల్లెట్.. కేటీఆర్ తెలంగాణ హీరో
Rasamayi Balakishan: హరీష్ రావు ఉద్యమ బుల్లెట్.. కేటీఆర్ తెలంగాణ హీరో

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డికి తొండల దోషం ఉన్నదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొన్నదని.. రేవంత్‌రెడ్డి మాటలు చూసి చిన్న పిల్లలు సైతం భయపడుతున్నారని అన్నారు. ఆయన తీరు చూసి తెలంగాణ ప్రజలు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నారని.. రేవంత్ ఈ రాష్ట్రానికి సీఎం కావడం దౌర్భాగ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత పల్లెలు దివాళా తీస్తున్నాయని అన్నారు. పంచాయతీల్లో గెలిచిన స్థానాలన్నీ తమవే అని రేవంత్ చెప్పుకుంటున్నారని.. ఆత్మీయ సమ్మేళనంలో రండ భాష మాట్లాడారని అన్నారు. పాన్ షాప్ దగ్గర గుట్కా తినేవాడి కంటే వల్గర్‌గా మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్ని రాష్ట్రాల్లో గెలిచిందో చెప్పాలని ప్రశ్నించారు.
మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేపో, మాపో కర్ణాటక రాష్ట్రంలో అధికారం కోల్పోయేలా ఉన్నదన్నారు. ‘అసలు నీ బతుకెంత రేవంత్‌రెడ్డి. కేసీఆర్ కాలి గోటికి సరిపోవు. నువ్వా కేసీఆర్‌పై మాట్లాడేది’ అని హెచ్చరించారు. హరీశ్‌రావు వ్యక్తిత్వం గురించి చూడాలంటే తలపైకి ఎత్తి చూడాలన్నారు. ఆయన ఉద్యమ బుల్లెట్ అని అన్నారు. కేటీఆర్ తెలంగాణ హీరో అని పేర్కొన్నారు. కేటీఆర్ ఆంధ్రలో చదువుకుంటే తప్పు ఏముందని.. రేవంత్ బిడ్డను ఆంధ్రా ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఎందుకు ఇచ్చావు అని నిలదీశారు. సర్వం ఆంధ్రా అల్లుడికి కట్టబెడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమ బిడ్డలందరికీ తెలంగాణ తల్లి శోభమ్మ అని.. అలాంటి తల్లిని పట్టుకొని నీ అవ్వా అని అంటవా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి భాష మార్చుకోవాలన్నారు. కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టగానే రేవంత్‌కు లాగు తడిచి పోయిందన్నారు.






