- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
T Congress: బీజేపీకి మద్దతిచ్చిన వ్యక్తి కోసం నాకు నోటీసులా? పీసీసీ నోటీసులపై కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే
తూముకుంట నర్సారెడ్డికి టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు తూముకుంట నర్సారెడ్డికి (Tumukunta Narsa Reddy) టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ (PCC Disciplinary Committee) నోటీసులు ఇచ్చింది. ఇటీవల గజ్వేల్ లో జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ కు నర్సారెడ్డికి మధ్య జరిగిన గొడవపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని పీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఇవాళ గాంధీ భవన్ లో నర్సారెడ్డి క్రమశిక్షణ కమిటీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ తో గొడవ విషయంలో వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నెల మొదటి వారంతో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ముట్రాజ్ పల్లిలో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ చార్జి మంత్రి వివేక్ వెంకట స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ పట్టణంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము విజయ్ కుమార్ కు తూముకుంట నర్సారెడ్డికి మధ్య గొడవ జరిగింది. దీంతో నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషించారని విజయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదుతో నర్సారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.
బీజేపీకి మద్దతిచ్చిన వ్యక్తి కోసం నాకు నోటీసులిచ్చారు:నర్సారెడ్డి
క్రమశిక్షణ కమిటీతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన నర్సారెడ్డి.. తప్పుడు ఆరోపణలతో అట్రాసిటీ కేసు నమోదు చేశారని కమిటీకి చెప్పానన్నారు. ఎంపీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చిన వ్యక్తి ఫిర్యాదుపై నాకు నోటీసులు ఎందుకు ఇచ్చారో అర్థం కావడం లేదని చెప్పారు. తాను దళితుల సహకారంతోనే రాజకీయంగా ఎదిగానని దళితులకే ఎక్కువ పదవులు ఇచ్చినట్టు చెప్పారు.






