Breaking: బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

by Ramesh Naini |   (  Updated:2025-09-25 15:28:59  IST  )

సిర్పూర్ శాసనసభ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

Breaking: బీఆర్ఎస్ పార్టీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప
X

దిశ, తెలంగాణ బ్యూరో: సిర్పూర్-కాగజ్‌నగర్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మళ్లీ బీఆర్ఎస్ గూటికి చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫునే పోటీ చేసి ఆయన బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే.. అదే నియోజకవర్గం నుంచి బీఎస్పీ తరఫున ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన చేరికతో అలిగిన కోనేరు కోనప్ప బీఆర్ఎస్ నుంచి తప్పుకుని కాంగ్రెస్ గూటికి చేరారు.

కొంత కాలంగా ఆయన హస్తం పార్టీకి సైతం దూరంగా ఉంటున్నారు. తాజాగా.. గురువారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసంలో కోనప్ప ఆయన సోదరుడు కృష్ణ బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వారిద్దరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్‌రావు కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. కాగా.. కోనప్ప 2014లో బీఎస్పీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు.

Next Story