రేవంత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది నేనే: మాజీ ఎమ్మెల్యే

by Gantepaka Srikanth |

రేవంత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది నేనే: మాజీ ఎమ్మెల్యే

రేవంత్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకువచ్చింది నేనే: మాజీ ఎమ్మెల్యే
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్(Jaipal Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తానే రాజకీయాల్లోకి తీసుకొచ్చానని.. జెడ్పీటీసీ టికెట్ ఇప్పించానని జైపాల్ యాదవ్ గుర్తుచేశారు. కానీ ఇప్పుడు తల్లికి ద్రోహం చేసినట్లుగా.. ‘పాలమూరు బిడ్డను’ అని చెప్పుకుంటూ పాలమూరు ప్రజలను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రేవంత్ రెడ్డి నేడు చేస్తున్న పాలన, కేవలం జేబులు నింపుకోవడం, దాచుకోవడం కోసమే అని విమర్శించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 10,000 ఎకరాల భూమిని కొల్లగొట్టాలని చూస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. దీంతో పాటు మరో రూ.50 వేల కోట్ల విద్యుత్ కుంభకోణం చేస్తున్నాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.


అనంతరం కేటీఆర్ మాట్లాడారు. రిజర్వేషన్ల పేరుతో నాటకాలాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీసీ సోదరులు తగిన బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. రేవంత్ రెడ్డి సీఎంలా కాకుండా.. రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా పనిచేస్తున్నారని విమర్శించారు. మొదట మూసీ భూములు, ఆ తర్వాత ట్రిబుల్ ఆర్, సెంట్రల్ యూనివర్సిటీ భూములపై పడ్డ రేవంత్ రెడ్డి.. ఇప్పుడు హిల్ట్​పాలసీ పేరుతో ఇండస్ట్రియల్​భూముల కుంభకోణానికి తెరతీశారని ఫైర్​అయ్యారు. ఆ భూముల్లో అపార్ట్​మెంట్లు, విల్లాలు కట్టేందుకు రేవంత్ రెడ్డి అతి తక్కువ ధరకే అనుమతులిస్తూ రియల్​ఎస్టేట్​దందా చేస్తున్నారని ఆరోపించారు. వీడియో

Next Story