- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ ప్రజలను బండి సంజయ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారా?.. జగ్గారెడ్డి సీరియస్
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) కౌంటర్ ఇచ్చారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Bandi Sanjay) వ్యాఖ్యలకు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jagga Reddy) కౌంటర్ ఇచ్చారు. శనివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్‌కు వ్యవస్థపై అవగాహన లేదని విమర్శించారు. ఎలాంటి రాజకీయ అనుభవం లేకుండానే ఆయనకు కేంద్రమంత్రి పదవి వచ్చిందని ఎద్దేవా చేశారు. పదవిని అడ్డంపెట్టుకొని ఏది అది మాట్లాడతానంటే కుదరదు అని అన్నారు. బండి సంజయ్ కేవలం ఒక బ్రేకింగ్ లీడర్ మాత్రమే అని.. ఆయన మాటలకు తలా తోక ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు.
రేషన్ కార్డులపై, ఇందిరమ్మ ఇళ్ల పథకంపై ప్రధాని మోడీ(PM Modi) ఫొటో పెట్టకపోతే కేంద్రం నుంచి నిధులు ఇవ్వరా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలను బండి సంజయ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. మోడీ ఫొటో పెట్టకపోతే.. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వబోము అని బండి సంజయ్ ఎలా మాట్లాడతారని సీరియస్ అయ్యారు. రాష్ట్రం నుంచి కేంద్రమంత్రిగా ఉండి.. నిధులు ఇవ్వం అని బెదిరిస్తారా? అని అడిగారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేశారు. కిషన్ రెడ్డి సమర్దిస్తారో లేక విమర్శిస్తారో చెప్పాలని అన్నారు.






