TG: లైవ్ డిబేట్‌లో పెగ్గేసిన మాజీ ఎమ్మెల్యే.. వివరణ ఇస్తూ ట్వీట్

by Gantepaka Srikanth |

లైవ్ డిబేట్‌లో బీఆర్ఎస్ నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మందు తాగుతూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

TG: లైవ్ డిబేట్‌లో పెగ్గేసిన మాజీ ఎమ్మెల్యే.. వివరణ ఇస్తూ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: లైవ్ డిబేట్‌లో బీఆర్ఎస్ నేత, కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్(Bollam Mallaiah Yadav) మందు తాగుతూ కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ దృశ్యాలను కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు నెట్టింట విస్తృతంగా షేర్ చేసి.. ట్రోల్ చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య స్పందించారు. వివరణ ఇస్తూ తాజాగా ట్వీట్ చేశారు. ‘డిబేట్లలో మాట్లాడుతున్నప్పుడు బ్లాక్ కాఫీ తాగడం నాకు అలవాటు. దాన్ని మద్యం లాగా కొంతమంది కావాలని చిత్రీకరించే ప్రయత్నాలు చేశారు. అవన్నీ అవాస్తవాలు. నేను మద్యం తాగానని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు. ఇంకో విషయం కూడా స్పష్టంగా చెబుతున్నాను. నా ట్విట్టర్‌ హ్యాండిల్‌ను నేనే ఉపయోగిస్తాను. రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని కొంతమంది.. ఈ కుట్రలకు తెరదీశారు. అయినా నేనేం తగ్గను. నా పోరాటాన్ని కూడా ఆపను. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లో, సోషల్ మీడియాలో ఎండగడుతూనే ఉంటాను. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ఈ సమయంలో ఇలాంటి దుష్ప్రచారాలు వస్తాయని నేను ముందే ఊహించాను. అందుకే నేనేం భయపడట్లేదు. నేను ఎప్పుడూ ప్రజల పక్షాన నిలబడే వ్యక్తిని. నాపై తప్పుడు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై తప్పకుండా చట్టపరంగా వెళ్తాను’ అని బొల్లం మల్లయ్య ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story