- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సీఎం రమేశ్‌పై బీఆర్ఎస్ నేత సంచలన వ్యాఖ్యలు.. కులాల మధ్య చిచ్చు పెట్టొద్దని హితవు
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై ఏపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలపై మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు(Bhaskar Rao) స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)పై ఏపీ ఎంపీ సీఎం రమేశ్ చేసిన ఆరోపణలపై మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు(Bhaskar Rao) స్పందించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్రోకర్ మాటలు మాట్లాడటం ఇకనైనా మానుకోవాలని సీఎం రమేశ్‌కు హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డికి కమ్మ సామాజికవర్గం మీద అంత ప్రేమ ఉంటే.. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో కమ్మ నేతకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని అన్నారు. బీజేపీలో ఏ స్థాయి నేతను నేరుగా కలిసే స్థాయి కేసీఆర్‌ది.. మధ్యలో సీఎం రమేశ్ పైరవీ ఎందుకని మండిపడ్డారు. సీనియర్ ఎన్టీఆర్ తర్వాత.. కమ్మ సామాజికవర్గానికి అత్యంత ప్రయారిటీ ఇచ్చింది కేసీఆరే అని అన్నారు. ఓడిపోయి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తుమ్మల నాగేశ్వర రావుకు మంత్రి పదవి.. ఆ తర్వాత ఎమ్మెల్సీని చేశారని గుర్తుచేశారు. తుమ్మల, మాగంటి గోపీనాద్, పువ్వాడ అజయ్ ఇలా అనేక మంది కమ్మ నేతలకు కేసీఆర్ చాలా అవకాశాలు ఇచ్చారని అన్నారు. కులాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడటం ఇకనైనా సీఎం రమేశ్ మానుకోవాలని సూచించారు.






