మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసు.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రిమాండ్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-18 13:59:28  IST  )

బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊహించని షాక్ తగిలింది. మంత్రి వివేక్ కాన్వాయ్‌పై దాడి కేసులో మంచిర్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

మంత్రి కాన్వాయ్‌పై దాడి కేసు.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు రిమాండ్
X

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి వివేక్ వెంకట‌స్వామి కాన్వాయ్‌పై దాడి కేసులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు వైద్య పరీక్షల అనంతరం ఆయనను నేరుగా మంచిర్యాలలోని ఫస్ట్ క్లాస్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎదుట హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి బాల్క సుమన్‌ సహా నలుగురికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఉత్తర్వుల అనంతరం పోలీసులు ఆయనను భారీ బందోబస్తు మధ్య ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలిస్తున్నారు.

Next Story