95 ఏళ్ల వయసులో సర్పంచిగా గెలిచిన మాజీ మంత్రి తండ్రి

by Muthe.Rajitha |

95 ఏళ్ల వయసులో కూడా ప్రజాసేవ చేయాలని సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి విజయం సాధించాడు ఓ వృద్ధుడు.

95 ఏళ్ల వయసులో సర్పంచిగా గెలిచిన మాజీ మంత్రి తండ్రి
X

దిశ, వెబ్ డెస్క్ : 95 ఏళ్ల వయసులో కూడా ప్రజాసేవ చేయాలని సర్పంచ్ ఎన్నికల్లో నిలబడి విజయం సాధించాడు ఓ వృద్ధుడు. ఆ వృద్ధుడు ఎవరో కాదు బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తండ్రి రామచంద్రారెడ్డి. సూర్యాపేట జిల్లా నాగారం సర్పంచి ఎన్నికల్లో గుంటకండ్ల రామచంద్రారెడ్డి విజయం సాధించారు. గులాబీ పార్టీ మద్దతుతో బరిలో నిలిచిన రామచంద్రారెడ్డి, 95 ఏళ్ల వయసులోనూ సమాజసేవకు సిద్ధమంటూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శేష జీవితం గ్రామాభివృద్ధికి అంకితం చేయాలనేదే తన ఆకాంక్ష అని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ, గతంలో గ్రామానికి తన కుటుంబం చేసిన సేవలను గుర్తుచేస్తూ ఓట్లు అభ్యర్థించగా, ఈరోజు వెలువడిన ఫలితాల్లో విజయం సాధించడం గమనార్హం.

Next Story