నోరు జారిన ఎర్రబెల్లి!

by Disha Web Desk 14 |
నోరు జారిన ఎర్రబెల్లి!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్‌ను వీడిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఫైర్‌ అయ్యారు. వరంగల్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఆయన ఇవాళ మాట్లాడారు. కడియం శ్రీహరికి ఎమ్మెల్యే టికెట్‌ ఇప్పించింది తనేనని, మంత్రి పదవి వచ్చేలా చేసింది కూడా నేనేనని పేర్కొన్నారు. ఇప్పుడు కడియం శ్రీహరిని ఓడించే దాంట్లో కూడా మొదట తానే ఉంటానని చెప్పారు. అయితే ఈ క్రమంలోనే మాజీ మంత్రి ఎర్రబెల్లి తనకు తెలియకుండానే నోరు జారారు.

మొదట కడియం శ్రీహరికి టికెట్ ఇప్పించింది తానేనని చెప్పిన తర్వాత.. ‘ఎన్‌టీ రామారావు గారికి టికెట్ ఇప్పించింది నేనే’ అని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, సభలో ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కడియం కూతురికి ఎంపీ టికెట్ ఇవ్వొద్దని తాను ముందుగానే చెప్పానన్నారు. కావ్యకు టికెట్ ఇస్తే బీఆర్ఎస్ థర్డ్ ప్లేసులో ఉంటుందని హెచ్చరించానని తెలిపారు.

Next Story

Most Viewed