- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేను రాజీనామా చేస్తా: మాజీ మంత్రి తలసాని సంచలన ప్రకటన
నేను రాజీనామా చేస్తా అంటూ మాజీ మంత్రి తలసాని సంచలన ప్రకటన

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలోనే హైదరాబాద్ అద్భుతంగా అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం ఆయన జూబ్లీహిల్స్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి రెండేళ్లు పూర్తయింది.. అసలు హైదరాబాద్‌కు రేవంత్ రెడ్డి ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ఉప ఎన్నిక అనంతరం కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి చూపిస్తే.. నేను రాజీనామా చేస్తా అని సంచలన ప్రకటన చేశారు. జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతోనే అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్‌కు ఓటు వేయకపోతే బియ్యం, రేషన్ కార్డులు ఆగిపోతాయని బెదిరింపులకు దిగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ నేతలతో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎలా అమలు చేయించాలో బీఆర్ఎస్‌కు తెలుసని అన్నారు. జూబ్లీహిల్స్‌లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీనే అని జోస్యం చెప్పారు. అత్యంత భారీ మోజార్టీతో మాగంటి సునీత అసెంబ్లీలోకి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.






