- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Talasani: గ్రేటర్‌లో 30 శాతం మంది సర్వేలో పాల్గొనలేదు
అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రవేశ పెట్టిన కులగణన సర్వేపై బీఆర్ఎస్(BRS) కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ప్రవేశ పెట్టిన కులగణన సర్వేపై బీఆర్ఎస్(BRS) కీలక నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(Talasani Srinivas Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సర్వే కోసం 57 అంశాలను పరిగణలోకి తీసుకున్నారని విమర్శించారు. అనేక అంశాలు ఉండడంతో చాలా మంది సర్వేలో పాల్గొనలేదని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30 శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొనలేదని తెలిపారు.
సర్వేలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా తగ్గినట్టు ప్రచారం జరుగుతోందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణలో నూటికి 90 శాతం మంది బడుగు, బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు, మైనారిటీలే ఉన్నారన్నారు. ఈ రోజు అసెంబ్లీ లో ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారన్నారు. సమావేశాల షెడ్యూల్ ఇచ్చి మాట తప్పుతారా? కేబినెట్ సమావేశం(Telangana cabinet meeting) నిన్న పెట్టుకుంటే ఏమయ్యేదని ప్రశ్నించారు. మమ్మల్ని సభకు పిలిచి అవమానించారని.. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) చెప్పగానే ఒక్క నిమిషంలో సభను స్పీకర్ వాయిదా వేశారని సీరియస్ అయ్యారు.
స్పీకర్ సభను వాయిదా వేసే ముందు విపక్షాన్ని ఒక్క మాట కూడా అడగరా అని ప్రశ్నించారు. సభను వాయిదా వేయడం కుట్ర పూరితమని.. సభను ఒక రోజే నిర్వహించడం అన్యాయమని, కనీసం నాలుగు రోజులైనా సభను జరుపాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేసే ఉద్దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీసీలు చైతన్యవంతులని.. కేసీఆర్ ఏం చేశారో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో గమనిస్తున్నారని.. బీసీల కోసం మరో ఉద్యమం రాబోతోందన్నారు. తెలంగాణ ఉద్యమం కన్నా తీవ్రంగా ఈ ఉద్యమం ఉండబోతోందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక ప్రకటన చేశారు.






