చివరకు అంతలా దిగజారాలా?.. సీఎంపై మాజీ మంత్రి సెటైర్

by Gantepaka Srikanth |   (  Updated:2025-03-04 12:25:50  IST  )

తెలంగాణలో కాంగ్రెస్ అధికారం(Congress Govt)లోకి రాగానే.. బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్ర పరపతిని, ప్రతిష్టను బజారు కీడ్చారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సీరియస్ కామెంట్స్ చేశారు.

చివరకు అంతలా దిగజారాలా?.. సీఎంపై మాజీ మంత్రి సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కాంగ్రెస్ అధికారం(Congress Govt)లోకి రాగానే.. బ్రహ్మాండంగా ఉన్న రాష్ట్ర పరపతిని, ప్రతిష్టను బజారు కీడ్చారని మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) సీరియస్ కామెంట్స్ చేశారు. 14 నెలల్లోనే దివ్యమైన రాష్ట్రాన్ని దివాలా దివాలా అని దిగజారుడు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. మంగళవారం ఈ మేరకు హరీష్ రావు మీడియా ప్రకటన విడుదల చేశారు. మూసీ(Musi) సుందరీకరణ, హైడ్రా(Hydraa) అంటూ లేనిపోని భయాందోళనలు సృష్టించి హైదరాబాద్ బ్రాండ్‌(Hyderabad Brand)ను దెబ్బతీశారని సీరియస్ అయ్యారు. మొత్తంగా బీఆర్ఎస్(BRS) పాలనలో అద్భుతమైన ప్రగతి సాధించిన తెలంగాణను.. 14 నెలల్లోనే తిరోగమనం బాట పట్టించారని విమర్శించారు.

తలాతోకలేని విధానాలు, నిర్ణయాల వల్ల రాష్ట్ర రాబడి తగ్గడం వల్ల చివరకు ప్రభుత్వ భూములను అమ్ముకొని ఆదాయం సమకూర్చుకునే స్థాయికి దిగజారారని అన్నారు. ఆ భూములను అమ్ముకోవాలంటే కేసీఆర్(KCR) పదేళ్ల కాలంలో సాధించిన అభివృద్ధిని ప్రచారం చేసుకోకతప్పడం లేదని ఎద్దేవా చేశారు. ఒకవైపు తెలంగాణ దివాలా తీసిందంటూనే, మరోవైపు మీరు రూపొందించిన రిక్వెస్ట్ ఫర్ ప్రపోసల్ (RFP)లో ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్దిలో తెలంగాణ రోల్ మోడల్ అయ్యిందని, ఇండస్ట్రియల్ పాలసీ దేశానికే తలమానికం అని పేర్కొన్నారు. 2011-12లో 3.6లక్షల కోట్లుగా ఉన్న జీఎస్డీపీ, 2020-21 నాటికి 11.5 కోట్లకు చేరిందని, దేశంలోనే అత్యధిక ఎకనమిక్ గ్రోత్ నమోదు చేసిందని స్పష్టంగా తెలిపారు.

‘భూములు అమ్ముకోవడానికి డాక్యుమెంట్ల రూపంలో చెబుతున్న తెలంగాణ అభివృద్ధి గణాంకాలను, బహిరంగంగా ఎందుకు ఒప్పుకోవడం లేదు రేవంత్ రెడ్డి గారూ.. కేసీఆర్ చేసిన అభివృద్ధి మీరు ఎంత ప్రయత్నం చేసి దాచినా దాగదు. అసత్యాలు ప్రచారం చేయడం, ప్రతిపక్షాలను బుకాయించడం వంటివి ఇకనైనా మానుకోవాలని హితవు పలుకుతున్నా. భూములు అమ్మబోమని ప్రజలను, అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించినందుకు యావత్ తెలంగాణకు క్షమాపణలు చెప్పాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ భూములు అమ్మితే స్మశానానికి కూడా జాగ ఉండదన్న రేవంత్ రెడ్డి.. ఇప్పడు స్మశానాలకు భూములు ఎక్కడ పుట్టిస్తారో చెప్పాలి’ అని హరీష్ రావు డిమాండ్ చేశారు.

Next Story