ఢిల్లీకి వస్తాం.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు గగనమే: మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |   (  Updated:2025-07-28 14:49:05  IST  )

ఈ రోజు కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై ఏం తేలుస్తారు? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు.

ఢిల్లీకి వస్తాం.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు గగనమే: మాజీ మంత్రి కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలో సీఎం నానా హంగామా చేశారు.. ఈ రోజు కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై ఏం తేలుస్తారు? అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Former Minister Srinivas Goud) ప్రశ్నించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కూడా కులగణనకు ఒప్పుకుందని, దీంతో చట్టసభల్లో కూడా బీసీలకు రిజర్వేషన్లు (BC reservations) వస్తాయనే వాతావరణం ఏర్పడిందని అన్నారు. అయితే, చట్టసభల్లో రిజర్వేషన్లు దేవుడెరుగు ఇపుడు రాష్ట్రంలో జరగబోయే స్థానిక ఎన్నికల్లో (Local body elections) బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు రావడం గగనమవుతోందని తెలిపారు. గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్‌కు మోక్షం లభించలేదు.. ఢిల్లీలో రాష్ట్రపతి దగ్గర బుక్ బిల్లులు ఏమయ్యాయో తెలియదన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్, బీజేపీలది వగల ప్రేమే అని తేలిపోయిందని విమర్శించారు. బీసీ ఓట్ల కోసమే ఆ రెండు పార్టీలు డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు. తొమ్మిదో షెడ్యూల్లో పెడితే తప్ప బీసీలకు రిజర్వేషన్లు పెరగవని స్పష్టం చేశారు.

బీజేపీ ముస్లిం రిజర్వేషన్లను సాకుగా చూపి బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటోందని అన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడం లేదా? అని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లలో ముస్లింలు లేరా? అని నిలదీశారు. కాంగ్రెస్ బీసీ నాయకులు 42 శాతం రిజర్వేషన్ల పెంపు కోసం గట్టిగా కృషిచేయాలని అన్నారు. బీసీలకు ఏదీ చేయాలన్నా బీఆర్ఎస్‌కే సాధ్యం అని చెప్పారు. సీఎం, మంత్రులు బీసీ బిల్లులు ఆమోదించుకోవడానికి ఢిల్లీ వెళ్లి పాస్ అయ్యాకే హైదరాబాద్ తిరిగి రావాలన్నారు. ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గరకు పంపగానే కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారని, ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు కోసం ఎందుకు ఆర్డినెన్స్ తేలేదు? ఢిల్లీకి అఖిలపక్షం తీసుకెళితే మేము వస్తాం.. కానీ ఆ పని చేయడం లేదు.. అని అన్నారు.

Next Story