- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా..? మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అసలు మనిషేనా..? మానవత్వం ఉందా..?అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అసలు మనిషేనా..? మానవత్వం ఉందా..?అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనతో మాగంటి సునీత కన్నీళ్లు పెట్టారు.. కోల్పోయిన తన భర్తను గుర్తు చేసుకుంటూ బాధతో కన్నీళ్లు పెట్టుకుంటే డ్రామా అంటారా? అని మండిపడ్డారు.కమ్మ సామాజిక వర్గం వాళ్ళు ఓట్లు వేస్తే అదే సామాజిక వర్గం నుంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి అయ్యారని, అదే సామాజిక వర్గం ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చిందని అన్నారు. (Maganti Sunitha) మాగంటి సునీత బిడ్డలు, కొడుకు ప్రచారం చేస్తే యాక్షన్ ఎట్లా అవుతుందని మాజీ మంత్రి నిలదీశారు.
మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) వెంటనే బీఆర్ఎస్ నాయకురాలు, జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీతకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రుల భాషను మహిళలు వినాలి.. ఆడబిడ్డను మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ అవమానించారని ఆరోపించారు. మంత్రి పొన్నం మాట్లాడుతుంటే పక్కనే మేయర్ ఉన్నారు.. బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. మేయర్ స్పందించి ఉంటే బాగుండేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ చనిపోతే దేశవ్యాప్తంగా రాజీవ్ గాంధీ ఫోటోలతో ప్రచారం చేయలేదా..? అని ప్రశ్నించారు.






