- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Srinivas Goud: శ్రీలంకలో తిరగబడినట్లు రేవంత్‌పై తిరగబడ్తం
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt), సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్(Srinivas Goud) తీవ్ర విమర్శలు చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీల పరువు తీయడానికే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి కులగణన బిల్లు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం హడావిడిగా సర్వే చేసి.. బీసీల జనాభా ఇంతే అని తేల్చడం దారుణమన్నారు. కేబినెట్‌లో ఇచ్చిన నోట్‌ను ఎమ్మెల్యేలు(MLAs) ఎట్లా ప్రిపేర్ అవుతారని ప్రశ్నించారు. 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్నామని కేబినెట్‌లో నిర్ణయం తీసుకోలేదు.. అసెంబ్లీ(Telangana Assembly)లో చట్టం చేయలేదని మండిపడ్డారు. 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక ఎన్నికలు పెడతామని అన్నారు.. అసలు బీసీల జనాభా(BC Population)ను ఏ ఉద్దేశ్యంతో తక్కువ చేసి చూపించారని అడిగారు. సర్వే రిపోర్టును తారుమారు చేశారని ఆరోపించారు.
దేశంలో బీసీల జనాభా పెరిగి తెలంగాణలో ఎట్లా తగ్గిందని అన్నారు. బీసీలకు, ముస్లింలకు తగాదా పెట్టించే కుట్ర ప్రభుత్వం చేస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే తెలంగాణను ఆగం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీలంకలో తిరగబడినట్లు రేవంత్ రెడ్డిపై ప్రజలు తిరగబడే రోజు తప్పకుండా వస్తదని అన్నారు. రాష్ట్రాన్ని ఆగం చేస్తుంటే.. తెలంగాణ తెచ్చినోళ్లం ఊరుకోము అని హెచ్చరించారు. బీసీలకు తమిళనాడు తరహా రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీలను మోసం, దగా చేసేందుకు అసెంబ్లీ పెట్టారని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తున్నారని అన్నారు.






