మండుటెండల్లో పాదయాత్రలు చేస్తాం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి

by Gantepaka Srikanth |

పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

మండుటెండల్లో పాదయాత్రలు చేస్తాం: మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: పాలమూరు ప్రాజెక్టులపై ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. పాలమూరు రిజర్వాయర్లను వచ్చే వానాకాలంలో ఖచ్చితంగా నింపాలని.. దానికి కావాల్సిన పనులను చేపట్టాలని అన్నారు. లేదంటే మే మొదటివారంలో తమ కార్యాచరణ ప్రకటిస్తామని.. ప్రత్యక్ష యుద్ధానికి దిగుతామని హెచ్చరించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మండుటెండల్లో పాదయాత్రలు చేస్తామని.. పాలమూరును ఎందుకు పడావుపెట్టిండ్రో ప్రజల ముందు దోషులుగా నిలబెడతామని అన్నారు. కేఎల్ఐ నీళ్లు ఎలాంటి ఆంటంకం లేకుండా ఆ ప్రాంతానికి నీళ్లు చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు. గొల్లపల్లి రిజర్వాయర్ ప్రతిపాదనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు వాస్తవాలను, ఆధారాలను, కండ్ల ముందు నిజాలను వదిలేసి సిగ్గు, ఎగ్గూ లేకుండా మాట్లాడుతున్నారన్నారు. 2014కు ముందు పాలమూరు పరిస్థితి.. 2014 తెలంగాణ ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పు ఏమిటన్నది కనిపిస్తున్నదని చెప్పారు.

ప్రభుత్వ సోషియో ఎకనామిక్ సర్వే ప్రకారం 2014లో పాలమూరు జిల్లాలో తలసరి ఆదాయం రూ.74 వేలు అని.. 2024 - 25 నాటికి 352.86 శాతం పెరిగి రూ.3,36, 898కి చేరిందన్నారు. కాంగ్రెస్ విధానాల వల్ల రైతులు మళ్లీ వలసపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలిపారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి అన్ని రకాల అనుమతులు సాధించామని.. 2013 భూసేకరణ చట్టంలోని కఠిన నిబంధనలను అధిగమించి పబ్లిక్ హియరింగ్‌లు సైతం పూర్తిచేశామని.. 5 రిజర్వాయర్లు కట్టి, నాలుగు పంపింగ్ స్టేషన్లు పూర్తి చేసి, మోటార్లు పెట్టి ట్రయల్ రన్ నిర్వహించామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడో ఏడాది నడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా జిల్లా వాసి అయి సీఎం కనీసం ఎందుకు సమీక్షించడం లేదని ప్రశ్నించారు. జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు హైలెవెల్ రివ్యూ కోసం ఎందుకు అడగడం లేదని నిలదీశారు. మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేస్తే కరివెన వరకు 50 టీఎంసీల నీళ్లు నిలుపుకునే అవకాశం ఉన్నదన్నారు.

Next Story