CM రేవంత్‌లో ఓటమి భయం: సింగిరెడ్డి

by Gantepaka Srikanth |

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టాలనుకోవడం అప్రజాస్వామికమని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

CM రేవంత్‌లో ఓటమి భయం: సింగిరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించకుండా నామినేటెడ్ పద్ధతిలో కాంగ్రెస్ కార్యకర్తలకు కట్టబెట్టాలనుకోవడం అప్రజాస్వామికమని మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికలు పెడితే ఓటమి ఖాయమనే దొడ్డిదారిన నియామకాలకు కేబినెట్ నిర్ణయం తీసుకున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలో మూడు సార్లు రైతుభరోసా ఎగ్గొట్టారని.. కౌలు రైతులు, రైతు కూలీలను విస్మరించారని పేర్కొన్నారు. రైతుబీమాను అటకెక్కించారని.. వేల కొద్ది క్లెయిమ్‌లు పెండింగులో ఉండడంతో రైతు కుటుంబాలు సాయం కోసం ఎదురుచూస్తున్నాయని తెలిపారు. రైతులు వెనకటి మాదిరిగా కరెంటు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఇన్ని కష్టాలు అధిగమించి వ్యవసాయం చేస్తున్న రైతులకు కనీసం ప్రభుత్వం యూరియా అందించడం లేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులు ఆగ్రహంతో ఉన్న నేపథ్యంలో సహకార ఎన్నికలు పెడితే ఓటమి ఖాయమనే నామినేటెడ్ వైపు ప్రభుత్వం మొగ్గుచూపిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి దమ్ముంటే వెంటనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Next Story