- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG News : కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగా పాలమూరునుం పక్కన పెట్టింది : బీఆర్ఎస్ మాజీ మంత్రి
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్(KLI) నీళ్ల విడుదల సందర్భంగా కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy) ఖండించారు.

దిశ, వెబ్ డెస్క్ : కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్(KLI) నీళ్ల విడుదల సందర్భంగా కాంగ్రెస్ నేతల ఆరోపణలను బీఆర్ఎస్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Singireddy Niranjan Reddy) ఖండించారు. నేడు మీడియా సమావేశంలో కాంగ్రెస్ నేతలపై నిరంజన్ రెడ్డి పలు హాట్ కామెంట్స్ చేశారు. కృష్ణా నదిలో ప్రవాహం మొదలై 40 రోజులు గడుస్తున్నా కేఎల్ఐ మోటార్లు ఎందుకు ఆన్ చేయలేదని ప్రశ్నించారు. మోటార్లను ఆపకుండా కల్వకుర్తి ఎత్తిపోతల పరిధిలో ఉన్న చెరువులు, కుంటలను నీటితో నింపాలని ప్రభుత్వానికి సూచించారు.
పాలమూరు(Palamuru) పనులు పూర్తి చేసి నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్లను నింపాలి కాని కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పాలమూరు ఎత్తిపోతల పనులు చేపట్టడం లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా పాలమూరు ఎత్తిపోతల పనుల వ్యయం పెరిగి పోతున్నదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.. సమయం వచ్చినప్పుడు అన్నిటినీ బయటకు తీస్తామని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.






