- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అంగన్‌వాడీల రిక్రూట్‌మెంట్‌లో అవినీతి.. మాజీ మంత్రి తీవ్ర ఆరోపణలు
అంగన్‌వాడీల రిక్రూట్‌మెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: (Anganwadi) అంగన్‌వాడీల రిక్రూట్‌మెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. గురువారం ఆమె తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అంగన్‌వాడీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తాము అప్ గ్రేడ్ చేసిన వాటిని మరోసారి మినీ అంగన్‌వాడీలను అప్ గ్రేడ్ చేస్తూ తొలి సంతకం పెట్టారని.. కానీ ఇప్పటికీ వారికి జీతాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. అంగన్‌వాడీ వ్యవస్థను అవినీతిమయం చేశారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఏజెన్సీలో జీవో 3 అమలులో ఉన్నప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చిందని.. ఆ జీవోను సుప్రీంకోర్టు కొట్టి వేసిందన్నారు. దీంతోచ కేసీఆర్ జోనల్ సిస్టమ్‌ను తీసుకువచ్చారని చెప్పారు. జీవో రివ్యూ చేయకుండా కొత్త జీవో ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమం వెనుక స్కామ్ ఉంటుందని.. ఇందిరమ్మ కమిటీ సభ్యులు ప్రతి ఇంటికి 50 వేలు తీసుకుంటున్నారని ఆరోపించారు.
అంగన్‌వాడీలకు 10 మార్కులు వేసే అధికారం కలెక్టర్లకు ఇస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇన్‌చార్జి మంత్రుల సిఫారసులు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఎస్టీ రిజర్వేషన్లపై బస్సు యాత్రలు చేస్తున్న వారికి సిగ్గు ఉండాలన్నారు. లగచర్ల ఘటనతో లంబాడాలపై రేవంత్‌రెడ్డికి కోపం వచ్చిందని.. అందుకే.. వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీలతో సుప్రీంకోర్టులో కేసు వేయించారని పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డికి లంబాడాలు కర్రు కాల్చి వాతలు పెట్టడం ఖాయమని హెచ్చరించారు. మాజీ ఎంపీ మాలోత్ కవిత మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్ గ్రేస్ ప్రభుత్వంగా మారిందన్నారు. కలెక్టర్లకు 10 మార్కులు ఇచ్చే విధానాన్ని రద్దు చేయాలన్నారు. కరీంనగర్ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ వ్యవస్థను అవినీతి కేంద్రంగా మారుస్తున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్, బీఆర్ఎస్ నాయకురాళ్లు మూల విజయారెడ్డి, హరి రమాదేవి పాల్గొన్నారు.






