- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ ఫాంహౌజ్‌లో భేటీ అనంతరం మాజీ మంత్రికి అస్వస్థత
బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. నిన్న (శుక్రవారం) ఎర్రవెల్లిలోని తన (Form House) ఫాంహౌస్‌లో పార్టీ కీలక నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) కీలక సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే సమావేశం అనంతరం మధ్యాహ్నం భోజనం చేసిన సబితా ఇంద్రారెడ్డి.. రెండో సమావేశం అనంతరం తిరుగు ప్రయాణ సమయంలో స్వల్ప అస్వస్థతకు గురైయ్యారు. దీంతో వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు సబితా ఇంద్రారెడ్డిని సిద్దిపేటలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేర్పించారు. వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి ఫుడ్ పాయిజన్ వల్లే అస్వస్థకు గురైందని నిర్ధారించినట్లు సమాచారం. చికిత్స అనంతరం ఆమె హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే సబితా ఇంద్రారెడ్డికి ఫుడ్ పాయిజన్ అయిందంటూ తాజాగా నెట్టింట వార్త చక్కర్లు కొడుతోంది.






