- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రదాడిపై స్పందించిన మాజీమంత్రి.. ట్విట్టర్ వేదికగా కీలక వ్యాఖ్యలు
జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు.

దిశ, వెబ్ డెస్క్: జమ్ము కాశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిపై పలువురు ప్రముఖులు స్పందిస్తున్నారు. ఉగ్రదాడిని ఖండిస్తూనే... దాడిలో చనిపోయిన వారి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. జమ్ము కాశ్మీర్ (Jammu Kashmir)లోని పహల్గామ్ (Pahalagm)లో జరిగిన ఘోరమైన ఉగ్రదాడి (Terrorist Attack)లో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడమే గాక అనేకమంది గాయపడటం తీవ్ర దిగ్భ్రాంతి (Shocking)కి గురి చేసిందని అన్నారు.
మృతుల కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి (Deep Condolences)ని తెలియజేశారు. అంతేగాక ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనందరం ఐక్యంగా నిలబడాలని సూచించారు. ఉగ్రదాడిలో గాయపడిన వారి కోసం ప్రార్థిస్తున్నానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) రాసుకొచ్చారు. కాగా పహల్గామ్ లో ట్రెక్కింగ్ కోసం వెళ్లిన పర్యాటకులపై ఆర్మీ దుస్తుల మసుగులో ఉన్న ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో పలువురు అక్కడికక్కడే ప్రాణాలు వదిలివేయగా.. ఇంకొందరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ దాడిలో మొత్తం మృతుల సంఖ్య 26 కు చేరగా.. గాయపడిన మరికొందరికి చికిత్స కొనసాగుతోంది.






