వెలుగుమట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ : పువ్వాడ అజయ్ కుమార్

by Bhoopathi Nagaiah |

ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ బాధితులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం పరామర్శించి ధైర్యం చెప్పారు.

వెలుగుమట్ల బాధితులకు అండగా బీఆర్ఎస్ : పువ్వాడ అజయ్ కుమార్
X

దిశ, ఖమ్మంబ్యూరో: ఖమ్మం నగరంలోని అంబేద్కర్ భవన్‌లో ఆశ్రయం పొందుతున్న వెలుగుమట్ల భూదాన్ బాధితులను మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పునరావాస కేంద్రం నుండి బాధితులను వెళ్లగొట్టే ప్రయత్నాలు చేస్తోందని తీవ్రంగా ఆక్షేపించారు.నిరుపేదలు కట్టుకున్న గూడును కూల్చివేసి రోడ్డున పడేసిన ప్రభుత్వం ఇప్పుడు పునరావాస కేంద్రం నుంచి కూడా వారిని తరిమేయాలని కుట్ర పన్నుతోందని ఆయన మండిపడ్డారు.బాధితులకు పూర్తి న్యాయం జరిగే వరకు పునరావాస కేంద్రం నుండి బయటికి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.కేటీఆర్ ఆదేశానుసారం పువ్వాడ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాధితులకు భోజన ఏర్పాట్లు చేయడంతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. హెల్త్ చెకప్ క్యాంప్ ద్వారా బాధితులకు అవసరమైన విలువైన మందులను అందజేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి బాధితులకు స్వయంగా భోజనాలను వడ్డించారు.

బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.బాధితులకు న్యాయం జరిగేలా న్యాయస్థానంలో పోరాడేందుకు ప్రత్యేక లీగల్ సెల్ కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వెలుగుమట్లలోనే 100 గజాల స్థలం మరియు 5లక్షల రూపాయలు ఇచ్చి పక్కా ఇళ్ళు కట్టించాలని డిమాండ్ చేసారు.అధికారంలోకి రావడానికి ముందు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు నిరుపేదల సమస్యలను పూర్తిగా విస్మరించిందని ఆయన విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేసి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మమత సంస్థల డైరెక్టర్ పువ్వాడ నరేన్, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు,మాజీ డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం,మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ RJC కృష్ణ,ప్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ,కార్పొరేటర్లు నాగండ్ల కోటేశ్వరరావు,దండా జ్యోతి రెడ్డి,కూరాకుల వలరాజు,తోట రామారావు,మాటేటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

Next Story