BRS: తుంగతుర్తి సభలోనూ అవే అబద్ధాలు

by Gantepaka Srikanth |

రేవంత్‌ రెడ్డి పచ్చి మోసకారి.. అబద్ధాల కోరు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

BRS: తుంగతుర్తి సభలోనూ అవే అబద్ధాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రేవంత్‌ రెడ్డి పచ్చి మోసకారి.. అబద్ధాల కోరు అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తుంగతుర్తి సభలో మళ్లీ అవే పాత అబద్ధాలు వల్లే వేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి స్పీచ్‌ను ప్రజలు వినే పరిస్థితి నుండి చీదరించుకునే స్థాయికి దిగజారారని పేర్కొన్నారు. ఎన్నికలప్పుడు ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి.. చేతకాక తాజా సభలో రాబోయే రెండున్నర సంవత్సరాలలో లక్ష ఉద్యోగాలు ఇస్తామంటూ మాటమార్చి మోసం చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చి, రాత పరీక్షలు పెట్టి, ఎంపిక పూర్తి చేసిన తర్వాత వారికి నియామక పత్రాలు ఇచ్చారని.. కానీ, 60 వేల ఉద్యోగాలు తామే ఇచ్చామని రేవంత్ మళ్లీ మళ్లీ అబద్ధాలు చెబుతున్నారని తెలిపారు.

జవహర్ లాల్ నెహ్రు కట్టిన ప్రాజెక్ట్‌లే నల్లగొండ బీళ్లు తడుపుతున్నాయన్న రేవంత్‌రెడ్డి.. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎస్ఆర్ఎస్‌పీ నుంచి తుంగతుర్తి చివరి ఆయకట్టు వరకు ఎందుకు నీళ్లు రాలేదని ప్రశ్నించారు. పదేళ్లలో 6 లక్షల పైగా కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని.. చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. 4 పంటల వరికి రూ.500 బోనస్ ఎక్కడ వేశారని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో రైతు వ్యవసాయం పండగ అయితే.. ఈ 18 నెలల కాలంలో 700 పైగా రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరిగాయని నిలదీశారు. రాష్ట్రంలో ఏ గ్రామనికైనా పోదామని.. 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏవి సంక్రమంగా అమలవుతున్నయో ప్రజల మధ్యనే చర్చిద్దామని పేర్కొన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే కాళేశ్వరం లిఫ్ట్‌లు ప్రారంభించి నీళ్లు లిఫ్ట్ చేయడం లేదని ఆరోపించారు. వర్షాభావ పరిస్థితులు ఉన్న ఇలాంటి సమయంలో కాళేశ్వరం ప్రాజెక్ట్ వినియోగంలోకి తేకుండా రైతుల పంటలను ఎండబెడుతున్నారని పేర్కొన్నారు.

Next Story