- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హిల్ట్ పాలసీ కాదు.. టిల్ట్ పాలసీ : మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య
కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు సొమ్మును సంపాదించుకునే ఉద్దేశం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఆలోచన లేదని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలకు సొమ్మును సంపాదించుకునే ఉద్దేశం తప్ప రాష్ట్ర అభివృద్ధి ఆలోచన లేదని మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా రాజకీయం చేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలు ప్రజలకు ఉపయోగకరంగా లేవని అన్నారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో అంచనాలు భారీగా పెంచి లక్ష కోట్లు దాటించారని.. విభజన చట్టం ప్రకారం ఎన్టీపీసీ దగ్గర 2400 మెగావాట్ల విద్యుత్ తెలంగాణకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా కొత్త ప్రాజెక్టుల స్థాపన ఎందుకని ప్రశ్నించారు.
ప్రతిపక్షాల విమర్శలకు విద్యుత్ శాఖ మంత్రి సమాధానం చెప్పకుండా వేరే మంత్రులు జవాబిస్తున్నారని ఆరోపించారు. పవర్ లోడ్ ఫ్యాక్టర్ గురించి తెలియని వారు పవర్ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. అణు విద్యుత్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా అని ప్రశ్నించారు. తుమ్మిడిహెట్టి నుంచి సుందిళ్లకు నీళ్ళు ఎత్తి పోసి అటు నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తరలించడం గురించి సాగునీటి శాఖ మంత్రి మాట్లాడుతున్నారని.. అసలు ఎల్లంపల్లి నుంచి ఎన్ని నీళ్లు ఎత్తిపోశారో మంత్రి చెప్పగలరా అని ప్రశ్నించారు.
ఎల్లంపల్లి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీళ్ల సంగతి ఏంటని అన్నారు. తుమ్మిడిహెట్టి-సుందిళ్ల పేరుతో 9 నుంచి పన్నెండు వేల కోట్లు వృథా చేస్తున్నారని ఆరోపించారు. హిల్ట్ పాలసీ పేరుతో మరో భూ దోపిడీ యత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇది హిల్ట్ పాలసీ కాదని.. టిల్ట్ పాలసీ అని ఎద్దేవాచేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ నేతలు కె.కిశోర్‌గౌడ్, బాలరాజు యాదవ్, వెంకటేష్‌గౌడ్ పాల్గొన్నారు.






