కేటీఆర్‌‌ను కలిసిన మహారాష్ట్ర మాజీ మంత్రి

by Sathputhe Rajesh |   (  Updated:2023-04-11 09:01:01  IST  )

కేటీఆర్ ను మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మంగళవారం హైదరాబాద్‌లో కలిసారు.

కేటీఆర్‌‌ను కలిసిన మహారాష్ట్ర మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీని ఓ వైపు మహారాష్ట్రలో విస్తరించేందుకు కేసీఆర్ ప్లాన్ చేస్తున్న వేళ మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హైదరాబాద్‌కు రావడం ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లోని టీ హబ్ కు వెళ్లిన ఆయన దేశాభివృద్ధిపై పలు అంశాలను కేటీఆర్ తో పంచుకున్నట్లు తెలిపారు. టీ హబ్ ప్రత్యేకతను కేటీఆర్ ఆదిత్య ఠాక్రేకు వివరించారు. టీ హబ్ పనితీరు, ప్రోత్సహకాల విషయాలను కూడా ఠాక్రే అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు, నేషనల్ పాలిటిక్స్ పై వీరు డిస్కస్ చేశారు. ఈ నేపథ్యంలో తాను మంత్రి కేటీఆర్ ను కలిసినట్లు ఆదిత్య ఠాక్రే ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. కేటీఆర్ ను కలవడం అద్భుతంగా ఉందన్నారు. స్థిరత్వం, నగరీకరణ, సాంకేతికత విషయాలపై మాట్లాడుకున్నామన్నారు.

Next Story